సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి.

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 31. వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య ఆరోగ్య కార్యక్రమాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆమనగల్లు ఆసుపత్రి పనితీరు భేష్ గా వుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనీ, అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్యాధికారి తెలిపారు. అనంతరం ఆస్పత్రిలోని గదులను చూసి ఆయన విస్తూ పోయారు. కాగా వర్షం కురిస్తే‌ గదులు కురుస్తున్నాయని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కల్పనకు, అభివృద్ధికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటున్నామని డిఎమ్ అండ్ హెచ్ ఓ చెప్పారు. ఆయన వెంట జిల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాస్, డ్రాయింగ్ ఆఫీసర్ డాక్టర్ పరీక్షిత్, నరేందర్, సిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ నాగరాజు, డాక్టర్. మైమునా బేగం, డాక్టర్ విజయలక్ష్మి, సిహెచ్ఓ విజయ, స్టాఫ్ నర్స్ సునీత, సంధ్య, ల్యాబ్ టెక్నీషియన్ వేణు, ఎల్ డి సి మౌనిక, సూపవైజర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది హనుమంతు, గోపాల్ రెడ్డి, వెంకటయ్య, ఏఎన్ఎం. ఆసిఫా, మాధవి, అనురాధ, ఎలక్ట్రిషన్ శీను, తదితరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *