సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ లకు శుభాకాంక్షల వెల్లువ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో సాగుతూ ఆదర్శంగా నిలవనుందని మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కు చెందిన సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ లకు శుభాకంక్షలు తెలియజేసిన కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ మంత్రులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాకు చెందినసీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమారులు ఉన్నత పదవులలో ఉండడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వికారాబాద్ జిల్లా చరిత్ర రాష్ట్రంలో మైలురాయిగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. సీఎంగా స్పీకర్గా మంచి సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి స్పీకర్ ప్రసాద్ కుమార్ లకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి సర్పరాజ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *