వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 9; బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ నందు పలు కాలనీలలో దాదాపుగా 3,96,80,000 పైగా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన మరియు ప్రారంభించడానికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు డా.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.దానిలో భాగంగా దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా వాటర్ పైప్ లైన్లు మరియు,1 కోటి 96 లక్షల 80 వేల రూపాయలతో సీ.సీ.రోడ్లు,కమ్యూనిటీ హాలు,పార్క్ కాంపౌండ్ వాల్,చైన్ లింక్ ఫెన్సింగ్ తదితర అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు.బృందావన్ మిడోస్ కాలనీలో కృష్ణా వాటర్ పైపు లైన్ శంకుస్థాపన,జక్కిడి నగర్ కాలనీలో కృష్ణా వాటర్ పైపు లైన్ శంకుస్థాపన,శ్రీ గాయత్రి నగర్ కాలనీలో కృష్ణా వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన,గాయత్రి నగర్ ఫేస్ 4 కాలనీలో కృష్ణా వాటర్ పైపు లైన్ శంకుస్థాపన,మారుతినగర్ కాలనీలో సీ.సీ.రోడ్డు శంకుస్థాపన,ఆఫీసర్స్ కాలనీలో 13.60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన పార్క్ కాంపౌండ్ వాల్ ప్రారంభోత్సవం మరియు కృష్ణా వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన,57.50 లక్షల నిధులతో సాహెబ్ నగర్ క్రాంతి యువజన సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన,54 లక్షల రూపాయల నిధులతో స్నేహమయి నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న సీ.సీ.రోడ్డు పనులకు శంకుస్థాపన,28.70 లక్షల నిధులతో ఎస్కేడి నగర్ కమ్యూనిటీ హాలు గ్రౌండ్ చుట్టు చైన్ లింకు ఫెన్సింగ్ మరియు వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన,17 లక్షల రూపాయల నిధులతో ఎస్కేడి నగర్ కమ్యూనిటీ హాల్ వెనక రోడ్డులో నూతన సీ.సీ.రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన,26 లక్షల నిధులతో శ్రీరాం నగర్ కాలనీలో నూతన సీ.సీ.రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరిగింది.చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి.దశలవారిగా వాటిని కూడా ప్రణాళికబద్దంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.ముందుగా త్రాగునీరు,డ్రైనేజీ,రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఇవన్నీ పూర్తి చేశాక మిగిలిన పనులు చేయడం జరుగుతుందని అన్నారు.118 జీ.ఓ.ద్వారా ఎంతో మంది ప్రజలకు ఉపశమనం కలిగింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి,బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి,కుంట్లూరు వెంకటేష్ గౌడ్,నర్సింగ్ రావు,అనిల్ చౌదరి,సామ బుచ్చిరెడ్డి,కొంగర మహేష్,సుమన్ గౌడ్,రమేష్ నాయుడు,కాజా శ్రీనివాస్,రాఘవేందర్ రావు,సతీష్ చౌదరి,పొగుల రాంబాబు దయాకర్ ముదిరాజ్,గోవర్థన్ చౌదరి,రాజు యాదవ్,నిర్మలా దేవి,సక్కుబాయి,మేరీ,వరలక్ష్మి, శాంతి,కొత్త భాస్కర్ గౌడ్,ఎస్కేడి నగర్ కాలనీ కన్వీనర్ పుల్లారెడ్డి,గౌరవ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి,లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం చైర్మన్ సోమి రెడ్డి,శ్రీరామనగర్ కాలనీ అధ్యక్షులు రామ్మోహన్ గౌడ్,వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు కృష్ణ ,రాంబాబు గౌడ్,గాయత్రి నగర్ ఫేస్ 4 కాలనీ అధ్యక్షులు మనోజ్,చందు నాయక్,స్నేహమయి నగర్ కాలనీ అధ్యక్షులు రామాంజనేయులు,బృందావన్ కాలనీ అధ్యక్షులు శివశంకర్,జక్కిడి నగర్ కాలనీ అధ్యక్షులు యాది రెడ్డి,అనంతవేణి నగర్ అధ్యక్షులు తిరుమలేష్,బి.ఎన్.రెడ్డి. నగర్ కాలనీ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి,యువజన నాయకులు రాంబాబు,ప్రకాశ్ గౌడ్,గడలశేఖర్,శ్రీనివాస్,మారు తి నగర్ కాలనీ అధ్యక్షులు దుర్గ ప్రసాద్,ఆఫీసర్స్ కాలనీ అధ్యక్షులు బాలాజీ మరియు పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు,పలు విభాగాల నాయకులు,అనుబంధ సంస్థల నాయకులు,మహిళా నాయకురాలు,కార్యకర్తలు,అభిమాను లు,కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




