సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 20:  సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలదేవి అన్నారు ఈ మేరకు ఆమెచందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ, సాయి నగర్,కృష్ణ దేవరయ్య కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో   కార్పొరేటర్  మంజుల రఘునాథ్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్యామల దేవి  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  కేసీఆర్  మహిళ పక్షపాతి అని మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలైనఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ షాది ముబారక్, ఒంటరి మహిళల కు పింఛన్లు,కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం ,అసరా పెన్షన్ల పెంపు,దివ్యాంగుల పెన్షన్ పెంపు,400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనం అని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం,లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతి ని అందించడం  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామని పూర్తి ప్రణాళికను వివరించారు . కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంపు వంటి పలు కీలక హామీలు  దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.  సహకారంతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ  అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో వేలాదికోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి,నియోజకవర్గం ను అభివృద్ధి చేశారని ,   రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ  విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని,  శ్యామల దేవి  తెలియచేసారు,  ఎన్నికల్లో గాంధీ  భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని    అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉంది అని , సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉంది అని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం అని,బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ విజయం సాధిస్తుందని శ్యామల దేవి  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గుడ్ల ధనలక్ష్మి,  వరలక్ష్మి, చంద్రిక ప్రసాద్, మాధవి, పృథ్వి, రాధిక, ప్రణీత,భవాని, కుమార్, సునీత,మీనా ,హరిత, పార్వతి రాజేశ్వరి, యుగంధర్, రజిని, శ్యామల,  మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *