ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 16 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డు శివాలయం కాలనీలో సిసి రోడ్లు నిర్మించాలని కాలనీవాసులు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 15 వార్డులో అతి పురాతనమైన శివాలయం వద్ద ఇప్పటివరకు సిసి రోడ్డు లేక రోడ్డు అద్వానంగా మారిందన్నారు. వెంటనే సిసి రోడ్డుకు మంజూరు చేసి పనులు ప్రారంభించే విధంగా చూడాలని చైర్మన్ ను కాలనీవాసులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దుర్గయ్య కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు.



