‌సియాసత్‌ ఎడిటర్‌ ‌జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ‌మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి.. మావోయిస్ట్ ‌పార్టీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 :‌ప్రజాగాయకుడు గద్దర్‌ అం‌త్యక్రియల్లో పాల్గొని అక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడి గుండెపోటు తో మరణించిన సియాసత్‌ ‌పత్రిక ఎడిటర్‌ ‌జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ‌మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ఈ అం‌తిమ యాత్రలో పాల్గొవడం మూలంగా అంతిమ యాత్రలో దొర తనాన్ని ప్రదర్శంచాడానికి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలపై లాఠీ చార్జీ చేయడం మూలంగా ఆ తొక్కిస లాటలో జాహీరుద్దీన్‌ ఆలీ ఖాన్‌ ‌గారు గుండె పోటుతో మరణించారని విన్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ ఓ ‌ప్రకటనలో తెలిపారు.

జగన్‌ ‌ప్రకటన పూర్తి పాఠం…
జాహీరుద్దీన్‌ ఆలీ ఖాన్‌ ‌గారు 07-08-2023న గద్దర్‌ అం‌తిమ యాత్రలో పాల్గొని గుండె పోటుతో మరణించారనే వార్తా దిన పత్రికల ద్వారా తెలుసుకున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ఈ అం‌తిమ యాత్రలో పాల్గొవడం మూలంగా అంతిమ యాత్రలో దొర తనాన్ని ప్రదర్శంచాడానికి అంతిమ యాత్రలో పాల్గన్న ప్రజలపై లాఠీ చార్జీ చేయడం మూలంగా ఆ తొక్కిస లాటలో జాహీరుద్దీన్‌ ఆలీ ఖాన్‌  ‌గుండె పోటుతో మరణించారని విన్నాము. జాహీరుద్దీన్‌ ఆలీ ఖాన్‌ ‌మరణానికి కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌పూర్తి బాధ్యత వహించాలి.జాహిరుద్దీన్‌ ఆలీ ఖాన్‌ ‌మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్యసంఘటనలో తను ప్రధాన బాధ్యత వహిస్తూ ప్రజలను సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జర్నలిజంలో పని చేస్తూ ఉద్యమాలకు నాయకత్వ వహించాడు.

ముస్లీంలపై జరుగుతున్న మతోన్మావాద దాడులకు వ్యతిరేకంగా పోరాడాడు. రాశాడు. మాట్లాడాడు. ముస్లిం ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశాడు. మతోన్మావాదం అనేది ఏ మతంలో వుండకూడదని వాదించాడు. కేంద్ర, రాష్ట్ర దళారీ పాలక వర్గాల సామ్రాజ్యవాద, కార్పోరెట్‌ ‌దోపిడి అనుకూల విధానాలను నిక్కచ్ఛిక బహిర్గత పరుస్తూ తన కలంతో ప్రజలను చైతన్య పరిచాడు. పాలకుల నుండి ఒడుదొడుకులు, ఒత్తిళ్ళు ఎన్ని ఎదురైనా భయపడ లేదు. రాజీపడలేదు. లొంగి పోలేదు. ప్రజల్లో ప్రజల పక్షపాతిగా, ప్రజా స్వామ్య వాదిగా, సెక్యూలరిస్టుగా చెరగని ముద్రవేశాడు. సామాజిక విప్లవం చేస్తున్న సిపిఐ (మావోయిస్టు పార్టీ)కి తన వంతు మద్దతును తెలుపుతూ స్థిరకాల సానుభూతి పరుడుగా నిలిచాడు. ప్రజా స్వామ్యవాది జహీర్‌ ‌ఖాన్‌ ‌కు మా పార్టీ తరుపునా వినమ్రంగా సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *