సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.సిద్దిపేట యాదవ్ సదర్ ఉత్సవా కమిటీ, యాదవ సంఘం సంఘం అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో నిర్వహించిన సదర్ సయ్యాటలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సిద్దిపేటకు అన్ని వచ్చాయి.సదరు ఒకటి రాలేదు అది కూడ మన సిద్దిపేటకు వచ్చిందన్నారు.ప్రతి సంవత్సరం సదర్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకుందమన్నారు..యాదవు లకు గొప్ప పండుగ సదర్ అని అన్నారు.ఈ సందర్బంగా నిర్వాహకులు పయ్యావుల ఎల్లం యాదవ్, సందిప్ యాదవ్, ఎడ్ల హరిబాబు యాదవలకు మంత్రి అభినందించారు. హర్యాన రాష్టం నుండి తెచ్చిన దున్నలతో విన్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు రాజానర్సు,రవీందర్ రెడ్డి, పూర్ణిమ ఎల్లం యాదవ్,శ్రీ హరి యాదవ్,ఐలయ్య యాదవ్, మల్లయ్య యాదవ్, కనకరాజు,రాములు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరం




