సిద్దిపేటలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: సోనియా గాంధీ గారి 76 పుట్టినరోజును  మార్క సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద శ్రీమతి సోనియా గాంధీ  పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సందర్భంగా  శ్రీమతి సోనియా గాంధీ చిత్రపటానికి ముందుగా పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం 6 గ్యారంటీలు తెలంగాణ మహిళా లోకానికి ఈరోజు నుండి ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ  సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేటి నుండి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్పించిన కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ మహిళలందరూ సంతోషం వ్యక్తం చేశారు.సిద్దిపేట పట్టణంలో గాంధీ చౌక్ వద్ద మార్క సతీష్ కుమార్  ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ త్యాగశీలి  సోనియా గాంధీజీ  మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా అయ్యే అవకాశాన్ని తృణప్రాయంలో వదిలేసినటువంటి గొప్ప మహా నాయకురాలు  సోనియా గాంధీ దేశాన్ని ఆర్థిక రంగంలో దేశ సమగ్రత కోసం నిరంతరం ప్రజాసేవ చేయడమే ప్రజాసంక్షేమమే ముఖ్యమని, దేశ ప్రధానిగా అయ్యే అవకాశాన్ని రుణప్రాయంలో బదిలీ వేసిన  సోనియా గాంధీ  తెలంగాణ రాష్ట్రం కోసం 60 సంవత్సరాలుగా యావత్ తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు ఆత్మ బలిదానాలు చేసుకున్న సంగతి చూసి చలించి పైన  సోనియా గాంధీ  తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీకి మనం ఎంతో రుణపడి ఉన్నామని, మార్క సతీష్ కుమార్ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా మహిళల కోసం రైతన్నల కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజల కోసం శ్రీమతి సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కు ముందు హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఈరోజు నుండి మహిళలందరికీ తెలంగాణ అంతట ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిన ఘనత శ్రీమతి సోనియా గాంధీకి దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీతో నే సాధ్యమని శ్రీమతి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కార్గే అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కోసం రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ మహిళలందరికీ వరలక్ష్మి ధారా 2500 రూపాయలు అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనముల రేవంత్ రెడ్డి  ప్రతిరోజు ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని ఈ సందర్భంగా మార్కా సతీష్ కుమార్  మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి చంద్రశేఖర్, ధర్పల్లి చంద్రం, ఎన్ఎస్ఈఐ దాసరి రాజు, మీసం నాగరాజు, మీసం మహేందర్, బైరి సాయికుమార్, వెంగళ సుధీర్, డాన్ శీను, రాకేష్ యాదవ్, నరేష్, షాబుద్దీన్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు మహిళా కాంగ్రెస్ ఎన్ ఎస్ వి ఐ నాయకులు తదితరులు పాల్గొని సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి  నాయకత్వంలో మరెన్నో ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *