ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 19: సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ టీం గెలవాలని రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు దంపతులు కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సి డబ్ల్యూ సి క్రికెట్ వరల్డ్ కప్ లో అజయంగా గెలుస్తూ వస్తున్నటువంటి భారత్ టీం ఆదివారం అహ్మదాబాద్, గుజరాత్, నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా మీద తలపడుతుండడంతో భారత్ టీం గెలవాలని కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు రామంతపూర్ ప్రధాన రహదారి పై ఉన్న కట్టమైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ బిజెపి కన్వీనర్ దేవసాని బాలచందర్, రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకటరావు, బిజెపి సీనియర్ నాయకులు ముత్తినేని జగదీష్, మేడ్చల్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రేవు నరసింహ కురుమ, రామంతపూర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్య దర్శులు సంకూరి కుమారస్వామి, వులు గొండ నారాయణ దాసు, వేముల తిరుపతయ్య, తమ్మలి రవి, జట్ట సాయి ధీరజ్, వంగాల సంతోష్ గుప్తా, అల్లాడి నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



