ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : గత 27 సంవత్సరాలనుండి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం టిక్కెట్ కేటాయించి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్, న్యాయవాది మాథ్యూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది మాథ్యూ మాట్లాడుతూ సికింద్రాబాద్ లో జయసుధ బిజెపిలో చేరిన నేపథ్యంలో ఆ స్థానం తనకు కేటాయిస్తే పార్టీని భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను యూత్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీతో కూడా కలసి పని చేశానని తెలిపారు. ఇన్నేళ్లు తాను పార్టీకి చేసిన సేవలు గుర్తించి సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని కోరారు. అధిష్టానంపై తనకు విశ్వాసం ఉందని, తనకు టికెట్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



