సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద స్థలిని పరిశీలించిన హోమ్‌ ‌మంత్రి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 19 : సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనాస్థలాన్ని రాష్ట్ర హోమ్‌ ‌మంత్రి మహమూద్‌ అలీ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 22 ఫైర్‌ ఇం‌జిన్లతో మంటలు ఆర్పుతున్నట్లు హోమ్‌ ‌మంత్రి చెప్పారు. తాను సందరి&:చే సమయానికి 80శాతం మంటలు అదుపులోకి వొచ్చాయని.. మరో ఒకట్రెండు గంటల్లో పూర్తిగా అదుపులోకి వొస్తాయని అన్నారు. రెస్క్యూ సిబ్బందిలో నలుగురు పొగ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు భవనం లోపల చిక్కుకున్నారని అన్నారు.

ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటనా స్థలానికి వొచ్చిన హోం మంత్రికి స్థానిక ప్రజలు గోడు వెళ్లబోసుకున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా కట్టుబట్టలతో మిగిలిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంటలు పూర్తిగా అదుపులోకి వొచ్చాక పరిస్థితిని సవి•క్షించి నష్టపోయిన వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *