తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు అనేక విధాలుగా కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు.
1. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరములకు పెంచడం జరిగింది.
2. ప్రమాదవశాత్తు మృతి చెందినా కార్మికునికి కంపెనీ ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ను 10 రెట్లు పెంచి చెల్లించటం జరుగుతోంది. గతంలో ఒక లక్ష రూపాయలుగా ఉన్న ఈ మ్యాచింగ్ గ్రాంటును ఇప్పుడు 10 లక్షల రూపాయాలకు పెంచి చెల్లిస్తోంది.
3. డిపెండెంటు ఎంప్లాయిమెంట్ / ఎం.ఎం.సి. కి బదులు గతంలో ఏక మొత్తంగా 5 లక్షల రూపాయలు చెల్లిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వము దీనిని 25 లక్షల రూపాయలకు పెంచటం జరిగింది.
4.కార్మికుల స్వంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రుణం వరకు సింగరేణి వడ్డీ చెల్లించే పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోంది.
5).సింగరేణి కార్మికులతో పాటు వారి తల్లి దండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించటం జరుగుతోంది.
6). సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికుల కాలనీల్లోని క్వార్టర్లకు ఏ.సి. సౌకర్యం కోసం కంపెనీ చర్యలు తీసుకొంది.
7). ఐఐటి, ఐఐఎం చదివే కార్మికుల పిల్లల ఫీజులను కంపెనీయే చెల్లిస్తోంది.
8). మెడికల్ అన్ ఫిట్ ద్వారా ఉద్యోగం వద్దనుకునే వారికి ఏక మొత్తంగా 25 లక్షల రూపాయలు చెల్లింపు లేదా నెలకు 26,293 వేల రూపాయలు చెల్లించే పథకం ప్రవేశపెట్టడం జరిగింది.
9). మహిళ ఉద్యోగినులకు 12 వారాల ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచటం జరిగింది. అలాగే వారికి చైల్డ్ కేర్ లీవు ఇవ్వటం జరుగుతోంది.
10). కార్మికులు చెల్లించే విద్యుత్తు బిల్లు రద్దు చేయటం జరుగుతోంది.
11 పదవీ విరమణ చేసిన ఉద్యుగులకు కూడా వైద్య సదుపాయం కల్పిస్తోంది.
12 9,444 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది.
13 ఏప్రియల్ 14 అంబేద్కర్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.
14 తెలంగాణ రాష్ట్ర సాధనకు అద్భుతమైన పోరాటం చేసిన సింగరేణీ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ను మంజూరు చేయటం జరిగింది.
సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా
లాభాల బోనస్ ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భారీగా పెంచి పంపిణీ చేయటం జరిగింది. 2014లో 18 శాతం ఉండగా, 2015లో 21 శాతం, 2016లో 23 శాతం, 2017లో 25 శాతం, 2018లో 27 శాతం, 2019లో 28 శాతం, 2020లో 28 శాతం, 2021 లో 29 శాతం, 2022లో 30 శాతం పంపిణీ చేయటం జరిగింది.
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కీలక భూమిక పోషిస్తున్నది.
1సింగరేణిలో ఏటా మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది.
2తెలంగాణ, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర,కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకభూమిక పోషిస్తున్నది.
3రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్తు డిమాండ్ జూన్ 2014 లో 5,661 మెగావాట్లు ఉండగా, 2022 మార్చి నాటికి 14,160 మెగావాట్లకు పెరిగింది.
విద్యుత్తు ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాల ముఖ్యం. అందుకే నాలుగు బ్లాకులను కూడా సింగరేణికి కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు కేంద్రాన్ని కోరారు.
– కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్




