సబితా రెడ్డిని భారీ గజమాలతో సత్కరించిన కందుకూరు

సబితా రెడ్డిని భారీ గజమాలతో సత్కరించిన కందుకూరు మండలం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 6 : సబితా రెడ్డిని భారీ గజమాలతో  కందుకూరు మండలం బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి పలువురు నాయకులు ఆమె నివాసం వద్ద సత్కరించారు.మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సబిత ఇంద్రారెడ్డిని పూల బొకేతో మరియు భారీ గజమాలతో సత్కరించిన పార్టీ సీనియర్ నాయకులు సామ మహేందర్ రెడ్డి,సామ సురేందర్ రెడ్డి  అద్వర్యంలో గుడిమల్కాపూర్ బాలాజీ నగర్ కాలనీ వాసులు బిడబ్ల్యుయు మెంబర్స్ శేఖర్ రెడ్డి,సీనియర్ బిఆర్ఎస్ నాయకులు,మాధవ రెడ్డి,రామ్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,కిషన్ సింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆడికి మల్లికార్జున్,జనరల్ సెక్రెటరీ సామ సురేందర్ రెడ్డి,ఇసి మెంబర్ వెంకటరమణ పుల్కూరి రామారావు, రామరాజు,అందరూ శుభాకాంక్షలు తెలియ చేశారు.ఈ సందర్భంగా సబితా రెడ్డి మాట్లాడుతూ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆదరించి ప్రతి ఒక్కరు గెలిపించినందుకు వారికి తాను ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రతి నాయకులు,కార్యకర్తలు అభిమానులు ప్రజల్లో సంబంధాలు పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *