సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: సిద్దిపేటలోని సందీప్, లోహిత్ సాయి హాస్పిటల్స్ ను తక్షణమే సీజ్ చేయాలని సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కు చెందిన బిఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని సందీప్ హాస్పిటల్లో పిల్లలు కావడం లేదని పాలమాకులకు చెందిన రేబర్తి రేణుకచేరారని ,ఆరోగ్యంగా ఉన్న మహిళను పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ చేస్తామని గత ఆరు నెలల నుండి వాళ్ళ నుండి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ సెప్టెంబర్ 7న హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసుకొని వైద్యం చేస్తుండగా వైద్యం వికటించి చనిపోయిందన్నారు. కానీ, హాస్పిటల్ సిబ్బంది హాట్ స్ట్రోక్తో చనిపోయిందని చెప్పడం చాలా విడ్డూరమన్నారు. అనుభవం లేని డాక్టర్లను తీసుకొచ్చి పేద ప్రజల బతుకులతో చెలగాటమాడుతున్న సందీప్ హాస్పిటల్ , లోహిత్ హాస్పిటల్ లను వెంటనే సీజ్చేయాలని గురువారం బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి ,జిల్లా ఇన్చారి రోమాల బాబు ,అసెంబ్లీ ఇంచార్జ్ బకురీ అశోక్, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, భాను ,మల్లేష్ ముదిరాజ్ మంగబాబు మహేష్, ప్రశాంత్, శంకర్, బాధితురాలి భర్త శ్రీనివాస్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
సందీప్ హాస్పిటల్,లోహిత్ సాయి హాస్పిటల్స్ ను సీజ్ చేయాలి





