- కానీ..ఆధిపత్య కులాల ఆధిపత్యంలో సాధ్యం కాదు
- రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : సమాజ గమనాన్ని ముందస్తుగా అర్ధం చేసుకుని అప్రమత్తం చేసే మేధావులు సంచార జాతులు అధికారంలో భాగస్వామ్యులు కాలేకపోతున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ అన్నారు. విముక్త సంచార జాతుల దినోత్సవం సందర్భంగా సంచార జాతులు- రిజర్వేషన్‌పై మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ..నిజమైన అవసరం ఉన్న జాతులకు అధికారం అందడం లేదు. అందుకే మనమే ఎన్నికల్లో నిలబడదామని మీరంతా అంటున్నారు. ఆధిపత్య కులాలు పార్టీలు నడిపినంత కాలం మనకు అవకాశము రాదని ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ అంటున్నారని అన్నారు. జాగరూకత ఎంత చేసిన ఎన్నికల్లో మాత్రం మనం విజయం సాధించడం లేదని పేర్కొంటూ..ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న వోటును అంగట్లో సరుకు చేశారు.
బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే ఆత్మన్యూనత భావం లేకుండా పోరాటస్పూర్తితో ఎన్నికల్లో కొట్లాడాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులకు కూడా మెరిట్ ఉండాలి.. కడుపు బాధ తెలిసిన వాడై ఉండాలి..బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకొనే వాడయి ఉండాలి..ఈ జాతుల నుండి వొచ్చిన నాయకుడు అధికారంలోకి వొస్తేనే మన బాధలు తీరుతాయి..అని తెలిపారు. చదువుకునే సమయంలో కటోరాతో కొలిచిపెట్టిన బువ్వ తిన్న వాడిని కాబట్టే ఆర్థిక మంత్రినికాగానే సన్నబియ్యం పథకం తీసుకువచ్చిన …40 రోజుల పాటు అన్ని కులాల వారిని అసెంబ్లీలో మీటింగ్ పెట్టిన.. దాని ఫలితమే 250 రెసిడెన్సీయల్ స్కూల్స్. మనం నిర్మిస్తున్న కుల ఆత్మగౌరవ భవనం. అవి పెట్టింది విద్యను అందించేందుకు. మనకో షెల్టర్ ఇచ్చేందుకని ఈటల రాజేందర్ అన్నారు




