సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పర్స శ్యామ్ రావు నియామకం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ను సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పర్స శ్యామ్ రావు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను తనకు అప్పగించినందుకు కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు  గాలి అనిల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పని చేస్తానని తెలిపారు. ముక్యంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పటాన్ చెరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా జెండా ఎగరవేస్తుందని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *