సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూరు గ్రామ శివారులో ని వాగులోకి ట్రాక్టర్ దూసుకెల్లింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో రామన్న (56), మంగలి గోపాల్ (40), మల్లేశం (32) మృతిచెందారు. మధ్యాహ్నం సమయంలో కొల్కూరు నుండి నిజాంపూర్ గ్రామానికి ట్రాక్టర్ పై వెళ్తున్నారు. కోల్కూర్ శివారులో సింగూర్ ఎడమ కాలువలోకి అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇరువురు ట్రాక్టర్ కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందా.
సంగారెడ్డి జిల్లాలో విషాదం -వాగులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్




