షాద్నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లో స్వాతంత్ర అభ్యర్థులు గా కొందరు, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖాలు చేసారు,షాద్ నగర్ అసెంబ్లీ పోటీ కోసం పదిమంది నామినేషన్స్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. వెంకట మాధవరావు మీడియాకు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నుండి ప్రశాంత్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి అందే బాబయ్య, బి.ఎస్.పి పార్టీ నుండి మరొకరు రాము విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి వినయ్ కుమార్ సార స్వతంత్ర అభ్యర్థిగా చంద్రమౌళి, తుప్పుడు నరసయ్య మాదిగ, మరో స్వతంత్ర అభ్యర్థిగా నరసింహ రుస్తుం నామినేషన్ వేసినట్టు అధికారులు తెలిపారు..
అభ్యర్థులు నామినేషన్ వేయడంతో పాటు వాళ్ళ విజయ అపజయాల గురించి ప్రజలు వెయిట్ చేయడం జరుగుతుంది, నామినేషన్ వేయడం ఒక విధమైతే షాద్నగర్ నియోజకవర్గం లో గెలుపొందడం మరొక విధంగా ప్రజలు చూస్తా ఉన్నారు నామినేషన్ వేసిన అభ్యర్థులు తాము తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు .





