జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు సర్పంచ్ రజిత రమేష్ ఈవో మోహన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి శివ రాజ్ ఆధ్వర్యంలో లెక్కించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ రెండు నెలల పదిహేను రోజులకు వచ్చినా ఆదాయం రూపాయలు 4,15,833/- నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల ముపై మూడు రూపాయలు వచ్చిందని అన్నారు. వచ్చిన ఆదాయం అమ్మవారి దేవాలయం అభివృద్ధికి వినియోగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో దేవాదాయ శాఖ జేయూఓ అంజన్న దేవి,సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ రంగారావు,శ్రీనివాస్, రికార్డు అసిస్టెంట్ వెంకటరెడ్డి,శ్యామ్ రాజ్, వెంకట్ రెడ్డి, రాజరాజేశ్వరి సేవా సమితి, హరి బాబు, అర్చకులు కొండయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




