శ్రీ‌శైలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

  • ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు
  • భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు

శ్రీశైలం, డిసెంబర్‌ 26 : ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్‌ ‌వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం శ్రీశైలంలో ప్రసాద్‌ ‌పథకం ప్రాజెక్టులను ప్రారంభించారు.

తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌లోని హకీంపేటకు చేరుకున్నారు. భ్రమరాంబ గెస్ట్‌హౌస్‌ ‌నుంచి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *