శోభాయమానంగా శ్రీ కాళికాదేవి ఉత్సవ ఊరేగింపు .. ఊరేగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర జులై 17 : తాండూరు పట్టణంలోని కాళికాదేవి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సోమవారం శ్రీ కాళికాదేవి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు శోభాయమానంగా నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు రెండో రోజు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అమ్మవారి ఉత్సవ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన పేజీలో నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు పుర ప్రధాన వీధుల గుండ కొనసాగింది. ఊరేగింపులో అమ్మవారి విగ్రహంతో పాటు ప్రత్యేకంగా ఊరేగించిన అమ్మవారి ప్రతిమ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఊరేగింపు సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు చూపరులను కనువిందు చేశాయి. ఊరేగింపు లొ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, దేవాలయ చైర్మన్ ఆకుల రాములు, ఆలయ ఈఓ నరేందర్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, నరేందర్ గౌడ్, కౌన్సిలర్ బంటారం లావణ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, రాజకీయ, కుల సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *