శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.విజయదశమి సందర్భంగా శేరిలింగంపల్లి లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం వద్ద నిర్వహించిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ చేసినరావణ దహనం కార్యక్రమం పలువురుని ఆకట్టుకుంది.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ లో రామాలయం దేవస్థానం వద్ద దసరా ను పురస్కరించుకొని జరిగిన రావణ దహనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ చెడు పై గెలిచే విజయానికిప్రతీకగారావణసురదహణంజరుపుతారని, ,చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా పండుగ మానవాళికి ఓ సందేశం అని .మీరు చేసే ప్రతి కార్యం ఆ దుర్గామాత ఆశీస్సులతో విజయం చేకూరాలని,సకల శుభాలు కలగాలని , అదేవిదంగా పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ,అందరికి విజయం కలగాలని ,పండుగ ను చక్కటి వాతావరణం లోకుటంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా ,సంతోషకరంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియచేసారు ,జమ్మి పూజ చేసిన తర్వాత జమ్మి ని పంచి దసరా శుభాకంక్షాలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల సీనియర్ నాయకులు, సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు, ప్రజలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి లో ఘనంగా దసరా వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ





