శాంతి సౌబ్రాతృత్వాలకు ప్రతీక హోలీ పండుగ

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హోలీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 24 : ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల  పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్త వర్ణ రంగుల శోభను నింపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *