సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ఈవిఎం మిషన్లు, వివి ప్యాట్ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవాలనే దానిపై జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ బుధవారం సమీకృత జిల్లా కార్యలయ సముదాయంలో ఇదివరకే ఏర్పాటు చేసిన ఈవిఎం, వివి ప్యాట్ అవగాహన శిబిరంలో జిల్లా కలెక్టర్ స్వయంగా రిజిస్టర్ లో సంతకం చేసి ఈవీఎం మిషన్ ద్వారా ఓటు వేశారు. అనంతరం వివి ప్యాట్ స్లిప్ ని మిషన్ లో చుశారు. కార్యలయంకి వచ్చే ప్రతి ఒక్కరికీ ఈవీఎం మిషన్, వివి ప్యాట్ ల గుర్చి అవగాహన కల్పించాలి అలాగే అవగాహన పోందిన ప్రతి ఓక్కరి వివరాలను రిజిస్టర్ లో ఎంట్రి చెయ్యుంచాలని సిబ్బందికి తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఓక్కరు ప్రజాస్వామ్యం లో ఓటే పునాది.. ప్రతి ఓక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు.




