- జనవరిలో కొరోనా కేసులు పెరిగే ప్రమాదం
- కేంద్రం ప్రకటన
న్యూ దిల్లీ, డిసెంబర్ 29 : దేశంలో కొరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరింత ఫోకస్ పెంచింది. వొచ్చే 40 రోజులు భారత్‌కు చాలా కీలకమని భావిస్తున్నారు. జనవరిలో కొరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. కొరోనా ఎఫెక్ట్ ఎక్కువున్న చైనా, హాంకాంగ్, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఇంగ్లండ్ దేశాల నుంచి వొచ్చే వారికి కొరోనా టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు ఎయిర్ పోర్టుల్లో విదేశాల నుంచి వొచ్చే వారికి టెస్టులు చేయడం, ఐసోలేట్ చేయడం వంటి ఏర్పాట్లపైనా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవిక్షించనుంది. అక్కడ సన్నద్ధతపై మాండవీయ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే చైనా నుంచి వొచ్చే వారు 48 గంటల రిపోర్ట్ తోనే తమ దగ్గర ల్యాండ్ అవ్వాలని అమెరికా ఆదేశించింది.




