వొచ్చే ఏడాదికి ప్రభుత్వ సెలవుల ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : 2024 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించింది. వొచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 27, ఐచ్చిక సెలవులు 25 ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్‌ 9న ఉగాది, ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి, జూన్‌ 17న బక్రీద్‌, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి, అక్టోబర్‌ 10న దసరా, అక్టోబర్‌ 31న దీపావళికి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *