ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 2: చేవెళ్ల మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి డీసిసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవర సమత అన్నారు.దివంగత వైయస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్లలోని షాబాద్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వైయస్సార్ అడుగు జాడల్లో నడవాలని అన్నారు.ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు బాటలు వేసిన ఆయన పేదల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు.వైయఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేద వాడి ఇంటికి ఏదో ఒకటి చేరిందని అన్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్మెంట్,ఉచిత విద్యుత్తు,పావలా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాలతో వైయస్సార్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.ఇలాంటి పథకాలు తెలంగాణలో మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్న గారి శ్రీకాంత్ రెడ్డి,ఉప సర్పంచ్ గంగి యాదయ్య,చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్,ఎంపిటిసి గుండాల రాములు,వార్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,మల్లారెడ్డి,మల్లేష్,శ్ రీనివాస్,కో ఆప్షన్ సభ్యుడు నారాయణ,యువజన కాంగ్రెస్ నాయకులు మధ్యల శ్రీనివాస్,ఓబీసెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్,పిఏసిఎస్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి,పల్గుట శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచులు దేవల్ గారి గోపాల్ రెడ్డి,పడాల ప్రభాకర్,యువజన కాంగ్రెస్ నాయకులు సుశాంత్,అల్లాడ హరీశ్వర్ రెడ్డి,కావలి తిరుపతి, బురాన్ సురేష్,మైనార్టీ చేవెళ్ల విభాగం అధ్యక్షుడు లాకెత్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ముడిమాల్ రాములు,కేసారం గ్రామ నాయకులు,వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.


