వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి… జయంతి సందర్భంగా వైఎస్‌కు ఇడుపులపాయలో తల్లితో కలసి షర్మిల నివాళి

ఇడుపులపాయ, జూలై 8 : వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్‌ ‌తనయ వైఎస్‌  ‌షర్మిల శనివారం ఉదయం నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట తల్లి విజయ, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సందర్భంగా తల్లి విజయమ్మ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. కంట నీరు తుడుచుకుంటూ కనిపించారు. వైఎస్‌ ‌జయంతి సందర్భంగా ఏటా జులై 8న వైఎస్‌ ‌కుటుంబం  మొత్తం కలుసుకునేది. అందరూ ఇడుపులపాయలో జరిగే ప్రార్థనల్లో పాల్గొనే వాళ్లు. కానీ వైఎస్‌ ‌జగన్‌, ‌షర్మిల మధ్య విభేదాలు కారణంగా వేర్వేరుగా వచ్చి నివాళి అర్పించారు. గతేడాది ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకటిగానే వచ్చినా వేర్వేరుగానే ఉన్నారు.

ఈసారి మాత్రం ఉదయం షర్మిల వచ్చి వెళ్లిపోయిన తర్వాత జగన్‌ ‌వస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయచేరుకొని తండ్రి సమాధికి నివాళి అర్పించనున్నారు. వైఎస్సార్‌ ‌తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారని, ప్రియాంకతో షర్మిల చేతులు కలపబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. పదే పదే వీటిని ఆమె ఖండిస్తున్నా తరచూ కాంగ్రెస్‌ ‌నేతలతో సమావేశాలు ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. మొత్తానికి ఈ విషయంపై  ఏదో ఒకటి తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారమే కడప చేరుకున్న షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయానికి వెళ్లిన షర్మిల తన పేరు ద ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరు ద రిజిస్టేష్రన్‌ ‌చేశారు. మరో 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి రెడ్డి పేరుతో రిజిస్టేష్రన్‌ ‌చేశారు. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేశారు.

వైఎస్‌ ‌జయంతిని స్మరిస్తూ రాహుల్‌ ‌ట్వీట్‌
‌వైఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నందుకు  థాంక్స్ ‌చెప్పిన షర్మిల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి జయంతి  సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ సోషల్‌ ‌డియా వేదికగా ఆయనను స్మరిస్తూ ట్వీట్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధప్రదేశ్‌ ‌ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి‘ అని రాహుల్‌ ‌ట్విటర్‌ ‌వేదికగా తెలిపారు.  దీనిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి, వైఎస్‌ ‌కూతురు షర్మిల స్పందించారు. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌ను గుండెలో పెట్టుకున్నందుకు థాంక్స్ ‌చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ  ఆప్యాయతతో కూడిన మాటలకు థాంక్యూ రాహుల్‌ ‌గాంధీగారూ.  నాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన కాంగ్రెస్‌ ‌నాయకుడు డాక్టర్‌ ‌వైఎస్సార్‌. ఆయన సంక్షేమాన్నే ప్రస్తుతం దేశమంతా అవలంబిస్తోంది. డాక్టర్‌ ‌వైఎస్సార్‌  ‌గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందు కు ధన్యవాదాలు సర్‌ అని షర్మిల ట్విటర్‌ ‌వేదికగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *