వెల్జాల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర జనవరి 3 : తలకొండపల్లి మండలం వెల్జాల్  గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ  సంఘసంస్కర్తగా, రచయిత్రిగా, భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈ దేశ మహిళలకు అక్షరాలు నేర్పించిన చదువుల తల్లిగా, సామాజిక విప్లవకారినిగా, మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయురాలని కొనియాడారు. అనంతరం  మహిళా ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రస్థాయి కో కో పోటీలో  గెలుపొందిన విద్యార్థిని స్పందన కు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమం లో జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మూజీబూర్ రహేమాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజాక్, శేఖర్, లీల ఉపాధ్యాయులు వెంకట రమణ రెడ్డి, పరమేష్, ప్రవీణ్, చిట్టమ్మ, కల్పన, పెర్సీస్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *