ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మండలంలోని మేడిగడ్డ గ్రామ పంచాయితీ గుడి తండాలో వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.3, లక్షల విరాళం అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు గుడి నిర్మాణానికి మూడు లక్షలరూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.1,50,000/- గతంలో అందించారు. బుధవారం మిగతా రూ.1,50,000/- రూపాయల చెక్ ను కమిటీ సభ్యులకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు లక్షలు అందజేశారు.ఈ కార్య్రమంలో ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముడావత్ తౌర్య, చంద్రియ, లోక్య నాయక్, చంద్రు నాయక్, పత్య నాయక్, యువకులు కుమార్, భవన్, సుభాష్, ప్రభాస్, శ్రీను, లతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


