శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్9: శేరిలింగంపల్లి కాంటెస్టడ్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన శనివారం మియపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ సాంబశివరావు ఆధ్వర్యంలో పేదలకు ధూపట్ల పంపిణీ,చందనగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం నందు కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జేరిపేటి జైపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో,గాంధీ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీ.రాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో,వివేకానంద నగర్ డివిజన్ రిక్షా పుల్లర్స్ కాలనీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ,కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్,పాపి రెడ్డి కాలనీ,ఆస్బెస్టాస్ కాలనీ,అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగరలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో కేకే కట్ చేశారు,కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ దవాఖానలో పండ్ల పంపిణీ,మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమెట్ మరియు హైటెక్ సిటీ నందు కాంగ్రెస్ నాయకులు గంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో డివిజన్ నాయకులు,కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చిన వేళసోనియా గాంధీ జన్మదినాన్ని జరుపుకోవడం సంతోషకరమైన విషయం అని60 ఏళ్ల ఆకాంక్ష ఫలించిన దివ్య దినం అని రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





