పరిగి,ప్రజాతంత్ర,నవంబర్ 07: ఈ నెల 11న చలో హైదరాబాద్ విశ్వరూప మహా సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,పరిగి ఇంఛార్జి సుభాష్ మాదిగ పిలుపునిచ్చారు.మంగళవారం పరిగి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద చలో హైదరాబాద్ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మాదిగ,మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలంటే అది కేవలం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తోనే సాధ్యం అని,మాదిగ ఉప కులాల విశ్వరూప మహా సభకు నియోజక వర్గంలోని మాదిగ కులస్తులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ఆనంద్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగ ,ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు మల్కాపు మాదిగ, జిల్లా కార్యదర్శి అంజి మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు మధు మాదిగ, కులక్చర్ల మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పరిగి పట్టణ ఇన్చార్జి వెంకట్ మాదిగ, రామన్న మాదిగ, అఖిల్ మాదిగ, మాణిక్యం మాదిగ తదితరులు పాల్గొన్నారు.
విశ్వరూప మహా సభకై చలో హైదరాబాద్



