విశాఖ మన్యంలో భారీగా పెరుగుతున్న చలి తీవ్రత

విశాఖపట్టణం, డిసెంబర్‌ 23 : ‌విశాఖ మన్యం చలి గుప్పెట్లో వణికుంది. విశాఖ ఏజెన్సీలో 6 డిగ్రీలకు మించి నమోదు కావటంలేదు. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయింది. విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా నిర్మానుష్యంగా మారుతోంది. రాత్రిపూట అస్సలు ఎవరూ బయటకు రావడం లేదు. మరోవైపు ఇదే సమయంలో అక్కడ పర్యాటకుల సందడి కూడా పెరుగుతుంది. అంబసింగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.

విశాఖ ఏజెన్సీలో  చలితీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.  ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.  సాయంత్రం అయితే.. బయటకురావడానికి ప్రజలు వెను కాముందా డుతున్నారు. ఉన్నవాళ్లు ఉన్నిదుస్తులతో తిరుగుతుంటే.. లేనివారు మంటలు వేసుకొని చలి పులి నుంచి తప్పించుకొంటున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకా శముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం పూర్తి నిర్మలంగా ఉండడం, ఎక్కడా తేమ లేకపోవడం చలి తీవ్రత మరింత పెరిగేందుకు దోహదపడుతుం దని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతు పవనాలు బలహీనం కావడం, బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడనం లేకపోవ డం వంటి కారణాలతో చలిగాలులు ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ, కోస్తా దుగా దిగువన కర్ణాటక వరకు విస్తరిస్తున్నాయి.

తెలుగు రాష్టాల్ర చుట్టూ ఉన్న విదర్భ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ‌మధ్యమహారాష్ట్రలు ఇప్పటికే చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ, కోస్తాలపై పడింది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంచు క్రమేపీ పెరుగుతుండడం కూడా చలికి ఒక కారణమన్నారు. రేడియేషన్‌ ‌ప్రభావంతో భూమి త్వరగా చల్లబడుతోందని, అందువల్లే రాత్రి ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోతున్నాయని వివరించారు. పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *