వినాయక మండపాన్ని ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో అమీన్ పూర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. అమీన్ పూర్ మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొల్లూరి చంద్రకళ గోపాల్, బాశెట్టి కృష్ణ, కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *