నేడు నార్ల తాతారావు వర్ధంతి
భారత దేశ విద్యుత్ రంగానికి నార్ల తాతారావు చేసిన సేవలు చిరస్మరణీయాలు. విద్యుత్ కేంద్రాల డిజైన్లు మార్చడంలో ఆయన చూపిన ప్రతిభ మార్గదర్శకం అయింది. వివిధ పదవులు నిర్వహించి విద్యుత్ ఉత్పాదన సామర్థ్య పెంపుకు విశేష కృషి చేశారు. నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్. నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన జన్మించారు. కౌతవరం లోనే ప్రాథమిక విద్య నభ్యసించారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎం.ఎస్ డిగ్రీ చదివిన తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించారు. పిదప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు సంస్థ (ఏపీఎస్ఈబీ) డివిజనల్ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టారు. తర్వాత మధ్యప్రదేశ్ విద్యుత్తు బోర్డులో పనిచేసిన కాలంలో దేశం లోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపారు. థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడం ద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశాని కంతటికీ ఆదర్శమయ్యాయి.
1974 నుంచి 1988 వరకూ 14 ఏళ్లపాటు ఏపీఎస్ఈబీ ఛైర్మన్ గా పని చేసారు. విద్యుత్తు రంగానికి విశిష్ట సేవలందించి నందుకు గాను 1983లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరులలో విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించారు. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించారు. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం. నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7 న హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరులు.
మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ, డివిజనల్ ఇంజినీర్ గాబీ విద్యుత్ బోర్డు, మధ్య ప్రదేశ్, కార్యదర్శి గాబీ మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ, ఛీఫ్ ఇంజినీర్ గాబీ మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖ, ఛైర్మన్ గాబీ కేంద్ర ప్రభుత్వ జల విద్యుత్ కమిషన్, సభ్యుడుగాబీ సూపర్ ధర్మల్ పవర్ స్టేషన్లుకమిటీ, ఛైర్మన్ గాబీ ఎనర్జీ రీసర్చ్ శాఖ, భారత శాస్త్ర సాంకేతిక పరిశోధక పరిషత్, ఛైర్మన్ గాబీ కేంద్రీయ జల విద్యుత్ సమితి, అధ్యక్షుడుగాబీ భారత అల్యూమినియమ్ కంపెనీ, డైరెక్టర్ గాబీ బంగ్లాదేశ్ పవర్ డెవలప్ అడ్వైజర్ గా, తదితర పదవులు నిర్వహించారు. ఓమ్ ప్రకాశ్ భాసిన్ పురస్కారము, పద్మ శ్రీ 1983బీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అసోసియేషన్, అమెరికా,గౌరవ సభ్యుడుబీ భారతరత్న, శ్రీ విశ్వేశ్వరయ్య అవార్డు 1985 ఆయన అందుకున్నారు.
-రామకిష్టయ్య సంగనభట్ల
9440595494





