తాండూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: ఎన్నికలవేళ బహుజలను విగ్రహాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని బిఎస్పి తాండూరు అసెంబ్లీ ఇన్చార్జి దొరిశెట్టి సత్యమూర్తి అన్నారు. శనివారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి గౌడ్ పాపన్న విగ్రహాన్ని తాండూర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని కానీ గత సంవత్సరం ఇదే స్థలంలో ఏర్పాటుచేసిన దిమ్మెను అధికారులు కూల్చి వేశారని అప్పుడు అధికారంలోనే ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సర్దార్ పాపాయి గౌడ్ విగ్రహాన్ని బీసీ నేతతో ఆవిష్కరించారని విగ్రహాల పేరుతో బీసీలను విచ్చిం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. బీసీలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వికారాబాద్ ,జహీరాబాద్ కొడంగల్ ప్రాంతాలలో మహనీయులు పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రతిష్టించే అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు ఈసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారని అన్నారు. బీసీ లందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని దొరల ఉచ్చులో పడరాదని సూచించారు. బహుజన సమాజ్ పార్టీ అందరి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని కుల సంఘాలు సైతం ఆలోచించాలని అన్నారు. తాండూర్ ప్రాంతంలో ఎక్కడా లేనివిధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారని మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. జనాభా ప్రాతిపదికతన 60 నుండి 70 మంది బీసీలకు తెలంగాణలో సీట్లు ఇస్తామని బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నట్లు తెలిపారు. 119 నియోజకవర్గాల లో ఎలాంటి పొత్తులు లేకుండా బీఎస్పీ పార్టీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాండూరు లో బలంగా ఉన్న బీసీ వర్గాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని బీసీలు అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మైనార్టీ నాయకులు అంజాద్ పాషా, నవీన్ కుమార్ యాదవ్, జగదీశ్వర్ ,రవి ముదిరాజ్ పాల్గొన్నారు.




