పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : విఆర్‌ఎల ఆందోళనకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్‌ఎలు పట్టుకొమ్మలని ట్విట్టర్ వేదికగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘విఆర్‌ఎలతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సాధక బాధకాలను గాలికి వొదిలేసింది. సీఎం హావి•లు గాలి మాటలుగా మిగిలాయి. విఆర్‌ఎల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’ అని రేవంత్ ట్వీట్ చేశారు.




