వా( ద ) నలు

వాన కురుస్తేనే వరద వస్తుంది

వాదిస్తే నే వాస్తవం తెలుస్తుంది

వరద ప్రవహించి వార్ది చేరుతుంది

వాస్తవం నిజమై నిలబడుతుంది

చినుకు చినుకు చిరుజల్లులు

మాటల మాటున మంటలు

వాస్తవం కాని వాదనలు

వాన కురువని ఎల్‌ ‌నినో మబ్బులు!

రాజకీయ వాదనల మబ్బులు

కమ్ముకుంటున్నవి

వాదనలు ఏరులు పారుచున్నవి

వాదన వరదలు ఆనకట్ట వరకే!

స్వచ్చమై నిలుస్తుందో

నురగై పారిపోతుందో తెలుస్తుంది!

ఎలక్షన్‌ ‌చెట్టు పైన

అందల మెక్కిన రాజకీయం ముక్క

నక్కజిత్తుల మంత్రాలకు

రాలి పడుతుందా!

ముందస్తు రుచులెందుకు?

తొందర పడి ముందే కూస్తే

కోస్తారో కాస్తారో

కూసి చూస్తే తెలుస్తుంది!

– పి.బక్కారెడ్డి, 9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *