- రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం
- గోదావరి నది ప్రాజెక్టులకు జలకళ…
- శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
- పూర్తిస్థాయికి హుస్సేన్ సాగర్ నీటిమట్టం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వొచ్చే 24 గంటల్లో తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో భారీ వర్షాలుకురుస్తాయని తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు, దీని ప్రభావంతో తెలంగాణతో పాటుపలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోవి•టర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
గోదావరి నది ప్రాజెక్టులకు జలకళ…శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోపాటు ఎగువన భారీ వానలతో గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ఒక్కొక్క ప్రాజెక్టులోకి వరద వొచ్చిచేరుతున్నది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 1,49,995 క్యూసెక్కుల ప్రవాహం వొస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పూర్తిస్థాయికి చేరుకుంటున్నది. శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులుకాగా, ప్రస్తుతం 1079.10 అడుగుల వద్ద ఉన్నది. నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు, ఇప్పుడు 49.968 టీఎంసీలుగా ఉంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కులు వొస్తున్నది. జలాశయం 1405 అడుగులుకాగా, ప్రస్తుతం 13972.52 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.
కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 462 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం 456.60 వి•టర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 458 వి•టర్లు. ఇక నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టులోకి 9200 క్యూసెక్కుల వరద వొచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా, ప్రస్తుతం 1180 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు వరద పోటిత్తింది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 84,269 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ఇప్పుడు 688.22 అడుగులకు చేరింది. జిల్లాలోని గ్డడెన్న జలాశయం పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 358.78 వి•టర్లు కాగా, ప్రస్తుతం 358 వి•టర్లుగా ఉన్నది.మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్ ఎ•-లో 9470 క్యూసెక్కులు.. ఔట్ ఎ•-లో 385 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 20.564 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదవరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39.5 అడుగులకు చేరింది.
దిగువన శబరి నది పోటు వలన గోదావరి ప్రవాహం నిదానంగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ఇన్ ప్లో 6,10,250 క్యూసెక్కులు.. ఔట్ ప్లో 7,10,250 క్యూసెక్కులుగా ఉంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్ట్ 75 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. త్రివేణి సంగమం కాళేశ్వరం పుష్కర ఘాట్ 11.200 వి•టర్ల మేర గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 1లక్ష 78 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 70 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 17.7581 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కడెం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కులు, అవుట్ ప్లో 78 వేల క్యూ సెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 687.5అడుగులకు చేరింది. నల్లగొండ జిల్లాలో మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇన్ ప్లో 5, 849.00 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7,759.00 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 642.10 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.70 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తు వరద నీరు వొచ్చి చేరుతుంది. అధికారులు దాదాపు 20 గేట్లు ఎత్తివేసి లక్షా 78 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 2లక్షల 33 వేల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 17.9526 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
పూర్తిస్థాయికి హుస్సేన్ సాగర్ నీటిమట్టం
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. భారీ వరదతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వరదనీటి కారణంగా ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద పోటు అధికంగా ఉంది. హుస్సేన్‌సాగర్ డేంజెర్ బెల్స్ మోగిస్తుంది. తీవ్రస్థాయిలో హుస్సేన్‌సాగర్‌కు వరద తీవ్రస్థాయిలో పోటెత్తుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. హుస్సెనసాగర్లో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరింది.
తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి 5800 క్యూసెక్కుల నీటిని మూసిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అలాగూ ఉస్మాన్‌సాగర్‌కు కూడా వదర తాకిది అధికంగా ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలో ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 24న మరో అల్ప పీడనం ఏర్పడనుందని.. రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భదాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి మెదక్‌లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది.




