హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : దేశంలో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రుణాలను అందించడానికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాటర్.ఓఆర్జితో అనే అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఎండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ గురువారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న మొత్తాల్లో రుణాలు వంటి అందుబాటు ఫైనాన్సింగ్ ద్వారా సురక్షితమైన నీరు, పారిశుద్ధ్య పరిష్కారాలకు ప్రజలు పొందడంలో ఈ సంస్థ సహాయ పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద, స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రమైన పారిశుధ్యం కోసం ఫైనాన్సింగ్ అవసర మయ్యే ప్రాంతాలను గుర్తించడంలో ఉజ్జీవన్ బ్యాంకుకు వాటర్.ఓఆర్‌జి సహాయం చేస్తుందన్నారు.
వాటర్.ఓఆర్జితో ఉజ్జీవన్ బ్యాంక్ భాగస్వామ్యం





