మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 18 : వర్షాలు కురవడంతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు సూచించారు.సందర్బంగా మంత్రి మాట్లాడుతు వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది అని..రైతు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దు అని వర్షం పడడంతో చిన్న పిల్లలు సరదాగా అట ఆడడానికి బయటకు వెళ్తుంటారు, తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని సూచించారు.చెరువులలో చేపలు పట్టే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి రోడ్‌పై వెళ్లే వాహన దారులు జాగ్రత్తగా ఉండాలి ఉరుములు మెరుపులు వచ్చే క్రమం లో చెట్ల వద్ద రైతులు నిలుచోవద్దు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.




