- ప్రభుత్వ సాయం తీరుపై కాంగ్రెస్ అసంతృప్తి
- నేతల ప్రసంగాలను అడ్డుకున్న మంత్రులు
- ప్రభుత్వ సమాధానంపై నిరసనగా కాంగ్రెస్ వాకౌట్
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రులు తొండి వాదనలు తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ నేతలు.. చెక్ డ్యామ్‌లు వద్దన్నట్లు తప్పుడు వాదనలు చేశారు. శ్రీధర్‌బాబును మాట్లాడ నివ్వకుండా మంత్రులు అడుగడుగునా అడ్డుకున్నారు. శ్రీధర్‌బాబు ప్రసంగం పూర్తి కాకుండానే వెంటనే అక్బరుద్దీన్‌కు స్పీకర్ అవకాశం ఇచ్చారు. శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా మంత్రి కేటీఆర్ మధ్యలో అడ్డు తగిలారు. విద్యుత్‌పై రేవంత్ కామెంట్స్‌ను ప్రస్తావించారు. వరదలపై సమాధానం చెప్పలేక కేటీఆర్ డైవర్ట్ చేస్తున్నారని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌పై ప్రత్యేక చర్చ పెడితే తాము చర్చకు సిద్దమని శ్రీధర్ బాబు సవాల్ విసిరారు. మధ్యలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న మాట అనలేదని వివరణ ఇచ్చారు. తాము వీడియో చూపిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే వరద నష్ట పరిహారం ప్రకటించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదని… వరదలకు ఇది కూడా ఒక కారణమని శ్రీధర్‌బాబు సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ఉప ద్రవం వచ్చింది కాబట్టి నష్టం జరిగింది.. ప్రభుత్వం ద శ్రీధర్‌బాబు బురద జల్లొద్దని మంత్రి కోరారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 24 గంటల కరెంట్ వద్దు అంటున్నారు. చెక్ డ్యామ్‌లు వద్దని శ్రీధర్ బాబు అంటున్నారు. మరో కాంగ్రెస్ నేత ధరణి వద్దు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ విధానం. చెక్ డ్యామ్‌ల వల్ల నష్టం అంటారని నేను ఊహించలేదు అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. చెక్ డ్యామ్ వద్దు అనలేదు. శాస్త్రీయంగా నిర్మాణం చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రు ప్రశాంత్ రెడ్డి వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరించారు. వరదల వల్ల ఇండ్లు కూలిన వారికి ’గృహలక్ష్మి’ ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆపత్కాలంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది కూడా చాలా కృషి చేశారన్నారు. భారీ వరదల్లో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సిబ్బంది పనులు చేశారని తెలిపారు. మిషన్ భగీరథ సిబ్బంది కూడా చాలా వేగంగా నీటి సరఫరాను పునరుద్ధరించారని చెప్పారు. స్వల్పకాలిక చర్చలో భాగంగా అసెంబ్లీలో భారీ వర్షాలు, వరదలు ప్రభావంపై చర్చ అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
వరదల్లో 1500 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించామన్నారు. 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. 139 గ్రామాల్లో వరదల నష్టం ఎక్కువ జరిగిందని మంత్రి అన్నారు. 419 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని, 7500 ఇండ్లు పాక్షికంగా కూలియాన్నారు. వరదల వల్ల ఇల్లు కూలిన వారికి గృహలక్ష్మి పథకం ఆర్థికసాయం అందిస్తామన్నారు. కేందప్రభుత్వ సహాయంకోసం ఎన్నడూ ఎదురు చూడలేదని చెప్పారు. కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు.గత మూడేండ్లుగా జీహెచ్‌ఎంసీలో వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి వల్ల రోడ్ల నష్టం తగ్గుతున్నదని వెల్లడించారు. నాలాల అభివృద్ధివల్ల జీహెచ్‌ఎంసీలోనూ నష్టం తగ్గించగలిగా మన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి చేపట్టిన చర్యల వల్ల నష్ట తీవ్రత తగ్గుతున్నదని చెప్పారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పారు. వరద నష్టం అంచనాను శ్రీధర్‌బాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని శాఖల నివేదికలు వచ్చిన తర్వాత పంటనష్టం పరిహారంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమాను గుజరాత్ ప్రభుత్వమే అమలు చేయడం లేదన్నారు. మిషన్ కాకతీయ వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని మంత్రి చెప్పారు. గతంలో ఏటా వేల సంఖ్యలో చెరువలకు గండ్లు పడేవని అయితే మిషన్ కాకతీయ వల్ల చెరువుల వ్యవస్థ బలపడిందన్నారు.గత మూడేండ్లుగా జీహెచ్‌ఎంసీలో వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని మంత్రి అన్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి వల్ల రోడ్ల నష్టం తగ్గుతున్నదని వెల్లడించారు. నాలాల అభివృద్ధివల్ల జీహెచ్‌ఎంసీలోనూ నష్టం తగ్గించగలిగామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి చేపట్టిన చర్యల వల్ల నష్ట తీవ్రత తగ్గుతున్నదని చెప్పారు.
–



