కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 04 : మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు కోసం నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు గూడూరు అశోక్ గౌడ్ , చిన్నంరాజు ప్రభాకర్ గౌడ్, ర్యాల అశోక్ యాదవ్, చిన్నంరాజ్ సతీష్ గౌడ్ శనివారం ప్రచారం నిర్వహించారు . మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. బిఆర్ఎస్ ఎన్నికల్లో చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మరని అన్నారు. బిఆర్ఎస్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం





