వచ్చే ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్ భారీ మెజారిటీతో గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం బొంతపల్లి హనుమాన్ దేవాలయం నుండి ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు వినయ్,శంకర్,మల్లేష్,ప్రవీణ్, కిరణ్,ప్రశాంత్ యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర ప్రారంభించారు. ప్రజల మనిషిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్ ను గెలిపించేందుకు అందరు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గడపగడపకు పాదయాత్రతో సమస్యలు తెలుసుకుంటామని, గెలిచిన వెంటనే సమస్యలను నీలం మధు ముదిరాజ్ తీర్చనున్నారని తెలిపారు. ముదిరాజ్ లు అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చిన ఘనత నీలం మధు ముదిరాజ్ కి దక్కిందన్నారు. సబ్బండ వర్గాల మద్దతుతో ఆయన ముందుకు వస్తున్నారని చెప్పారు. అధికారం కోసం కాదని సేవ చేసే అవకాశం కోసమని వారు తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని నియోజకవర్గ ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. నాయకుని కోసం ప్రజలు కాదని, ప్రజల కోసమే నాయకుడు అనే విధంగా పనిచేయనున్నారని తెలిపారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి నీలం మధు ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించి ప్రజల మనిషిగా నిలవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *