లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌పురోగమనం

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 25 : ‌లైఫ్‌సైన్సెస్‌ ‌సెక్టార్‌లో హైదరాబాద్‌ ‌మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ ‌వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ ‌జీనోమ్‌ ‌వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషద రంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ‌ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ ‌సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

30 బిలియన్‌ ‌యూరోలతో ఫెర్రింగ్‌ ‌కంపెనీ ఏర్పాటయిందన్నారు. టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ ‌పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ ‌ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. స్విట్జర్లాండ్‌ ‌వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *