లింగ వివేచన పరివర్తనతో సుస్థిర ప్రగతి

• భారతదేశం జీ 20 అధ్యక్షతన మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఎజెండా పెద్ద మద్దతును పొందుతుంది
• మహిళలు నాయకులుగా ఎదిగేందుకు సమయం ఆసన్నమైంది

జీ 20 ఎంపవర్‌ అనేది  జీ 20 దేశాల నుండి సంస్థలు మరియు ప్రైవేట్‌ ‌సంస్థల భాగస్వామ్యంతో విద్య మరియు ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మహిళల సాధికారతను ప్రోత్సహించడానికి 20 దేశాల ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రపంచ చొరవ.
ప్రధాని  నరేంద్ర మోదీ సారథ్యంలో మహిళల నేతృత్వం లో అభివృద్ధి అనే అంశం ద్వారా మహిళా సాధికారత కథనం లో ఒక నూతన అధ్యాయం ప్రారంభించారు .రతదేశానికి సంబంధించిన ఈ వినూత్న పదజాలం ఇప్పుడు నిఘంటువులో భాగంగా మారింది.
జీ 20 ఎంపవర్‌  ‌మహిళా సాధికారత దృష్టి లో మహిళలు కేవలం లబ్ధిదారులే కాకుండా నాయకులుగా ఎదిగే వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా అభివృద్ధి అనే నూతన విధాన దృక్కోణం.భారతదేశం జీ 20 ఎంపవర్‌ ‌చైర్‌షిప్‌ ‌క్రింద, మేము ఈ భావనను హృదయపూర్వకంగా స్వీకరించాము. ఈ కథన ప్రగతిని ప్రతిబింబించే మార్గ పటాన్ని  రూపొందించడానికి ప్రయత్నించాం.
మా దృష్టి లో కీలకమైన మూడు అంశాలు: విద్య, మహిళా వ్యవస్థాపకత మరియు సృష్టి,అన్ని స్థాయిలలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం కోసం భాగస్వామ్యం. మేము డిజిటల్‌ ‌ను చోదక శక్తి అని నమ్ముతున్నాము. డిజిటల్‌ అనేది అన్నింటినీ అనుసంధానించే పరివ్యాప్తత అందుకే దీనికి మేము కట్టుబడి ఉన్నాము.

మహిళలు రాణించాలంటే వారికి అవసరమైన డిజిటల్‌ ‌సాధనాలు మరియు వనరులు సమంగా అందుబాటులో ఉండటం కీలకం.విద్యా రంగంలో మేము మహిళలకు ఎస్‌ ‌టీ ఈ ఎం విద్య మరియు అధిక వృద్ధి ఉద్యోగ అవకాశాలలో మెరుగైన ప్రవేశం కోసం వాదిస్తున్నాము.
మేము అప్రెంటిస్‌షిప్‌ ‌ప్రోగ్రామ్‌లు, భవిష్యత్‌ ‌సంసిద్ధత, సమ్మిళిత ఉన్న పాఠ్యాంశాలలో పెట్టుబడి పెట్టేందుకు కార్పొరేషన్లను ప్రోత్సహిస్తాము.యువతులు మరియు మహిళలకు నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించే విధానాలు మరియు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు స్పష్టమైన విధాన రూపకల్పన, ‘‘పూర్తి-ప్రభుత్వ’’ విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వాలను కోరింది.
ఉమెన్స్ ఎం‌టర్‌‌ప్రెన్యూర్‌షిప్‌ ‌పరంగా మహిళా పారిశ్రామి• •వేత్తలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న మరియుమీడియం ఎంటర్‌‌ప్రైజెస్‌ (ఎం ఎస్‌ ఎం ఈ ‌లు) చేయూతనందించే  సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసాము. మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు మెరుగుపరచడం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మెరుగైన లింగ సమానత్వం ఆర్థిక వ్యవస్థ యొక్క బలమైన స్తంభాలుగా మారడం అనేది ఉబయలాభదాయకం  మేము నమ్ముతున్నాము.

ప్రైవేట్‌ ‌రంగాన్ని కేవలం రుణదాతలు మరియు కొనుగోలుదారులుగా మాత్రమే కాకుండా గురువులుగా మరియు చేదోడుగా వారి వృద్ధి లో కూడా భాగస్వాములుగా ముందుకు సాగండని ప్రోత్సహిస్తున్నాం.  మేము అన్ని స్థాయిలలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కూడా కట్టుబడి ఉన్నాము. మేము మహిళల పురోగతి కోసం సామర్థ్యాన్ని పెంపొందించేవిధంగా నిర్ణయం తీసుకునే స్థాయిలు, కలుపుకొని పనిచేసే కార్యాలయ విధానాలను పరిచయం చేయడం, నిర్వహణ లింగ వైవిధ్య కొలమానాల యొక్క సాధారణ సమీక్షలు మరియు ప్రచురణలు మరియు భద్రతను నిర్ధారించడంమరియు మహిళా ఉద్యోగుల శ్రేయస్సు వంటి పలు కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నాం. మహిళలను సమాజంలోని అన్ని స్థాయిలలో నాయకత్వం మరియు నిర్ణయం తీసుకునే స్థాయికి  మనం వారిని సాధికారులను చెయ్యాలి.భారతదేశం అధ్యక్షత చొరవ తో  కింద ఆరు స్పష్టమైన ఫలితాలను గుర్తించడం పట్ల మేము ప్రత్యేకంగా గర్విస్తున్నాము.ముందుగా, మేము సాంకేతికత సమత ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాము.

image.png
ఇది విజ్ఞానం ద్వారా మహిళలు ముందంజలో ఉండటానికి సహాయపడేందుకు రూపొందించబడిన ఏకైక డిజిటల్‌ ‌ప్లాట్‌ఫారమ్‌. 120 ‌భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫారమ్‌ ‌రాబోయే ఆరు నెలల్లో కనీసం మిలియన్‌ ‌మహిళలకు చేరుకునే అవకాశం ఉంది.
రెండవది, మేము కే పీ ఐ డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసాము, మహిళా సాధికారతను మరియు ప్రాతినిధ్య పురోగతిని కొలవదగిన మరియు ట్రాక్‌ ‌చేయడానికి ఇది ఓ మెరుగైన మార్గం.అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి నమూనాలు, మూల కారణాలు మరియు సంభావ్య జోక్యాలు కోసం ఈ అధునాతమైన పద్దతులను ఉపయోగించి గణాంకాలను స్థిరంగా ట్రాక్‌ ‌చేయగలం మరియు గుర్తించగలం.మూడవదిగా, మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ అభ్యాసాలను సంకలనంచేసి ఉత్తమ అభ్యాసాల పాఠ్యపుస్తకాన్ని  రూపొందించాం. ఇది సర్వే-ఆధారిత విశ్లేషణాత్మక సాధనం. ఇది సమర్థవంతమైన వ్యూహాలు మరియు అభ్యాసాలను పంచుకోవడానికి రూపొందించబడింది.  ప్లేబుక్‌ ‌యొక్క 2023 ఎడిషన్‌ ‌జీ 20 కి చెందిన 19 అతిథి దేశాల నుండి 149 ఉత్తమ అభ్యాసాలను సంకలనం చేసింది.
నాల్గవది, మేము జీ 20లో స్ఫూర్తిదాయకమైన కథనాలపై ప్రత్యేక విభాగాన్ని రూపొందించాము. మహిళా సాధకుల విజయ గాథలను హైలైట్‌ ‌చేయడానికి జీ 20 దేశాలు మరియు 10 అతిథి దేశాల నుండి 73 స్ఫూర్తిదాయకమైన కథలు ఎంపవర్‌ ‌వెబ్‌సైట్‌ ‌లో సేకరించాము.ఇవి జీ 20 దేశాల ఎంపవర్‌ ‌వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడతాయి.ఐదవది, ఎంపవర్‌కు మన  భారతదేశ జీ 20ప్రెసిడెన్సీ కింద న్యాయవాదుల నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు చొరవ మరియు ప్రతిజ్ఞను స్వీకరించడం ద్వారా సదా మద్దతునిస్తూనే ఉంది.
జీ 20 ఎంపవర్‌ ‌న్యాయవాదుల నెట్‌వర్క్ ‌లో జీ 20 దేశాలలో విస్తరణను కొనసాగించి 500 మంది న్యాయవాదులకు చేరుకుంది.
చాలా ప్రభావవంతమైన సంస్థలు కలిగిన ఈ నెట్‌వర్క్ ‌లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది.
ఈ కార్యక్రమాలతో పాటు, మేము లింగ సమానత్వానికి ప్రైవేట్‌ ‌రంగం నుండి ఒక ముఖ్యమైన నిబద్ధతను వ్యక్తీకరించే గాంధీనగర్‌ ‌ప్రకటనను కూడా పరిచయం చేసాము.ఈ ప్రకటన ప్రకారం, కంపెనీలు తమ కంపెనీలో కనీసం 30 శాతం శ్రామిక శక్తి మహిళలు ఉండేలా ప్రతిజ్ఞ చేస్తాయి.ఇప్పటికే శ్రామిక శక్తి లో 30 శాతం మహిళలు ఉన్న కంపెనీలలో, సంస్థ యొక్క అన్ని స్థాయిలలో మొత్తం 30 శాతం మహిళలు ఉండేలా ప్రతిజ్ఞ విస్తరించింది.ఈ శక్తివంతమైన 30 బై 30 ప్రకటనను 2030 సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.మరింత సమానమైన మరియు సమ్మిళిత శ్రామిక శక్తిని సృష్టించేందుకు మా సామూహిక నిబద్ధత.

image.png
‌సంగీత రెడ్డి

(రచయిత జీ 20 ఎంపవర్‌ ‌చైర్‌ ‌మరియు ఫిక్కీ మాజీ అధ్యక్షురాలుబీ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *