పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని ప్రవేశపెట్టిందని, పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన క్రిస్టియన్ మైనార్టీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే దళిత బందు, బీసీ బందు పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో నూతన వెలుగులు తీసుకొని వచ్చారని తెలిపారు. ఈనెల 14వ తేదీలోగా www.tsobmmsgov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.




