రోడ్డు షోలతో దూసుకుపోతున్న సబితమ్మ-ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
బిఎస్పీ నేత ఇబ్రహీం శేఖర్ బేషరత్తుగా మద్దతు
భారీ మెజారిటీ దిశగా సబితమ్మ
మొదటి సారి మహేశ్వరంలో గులాబీ జెండా గుబాళింపు
మహేశ్వరంలో హ్యాట్రిక్ కొట్టబోతున్న సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 27: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో వరుస రోడ్డు షోలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ప్రచారంలో ఎక్కడ చూసిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువతి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సబితమ్మకే మా ఓటు అంటూ.. బహిరంగంగా మద్దతు తెలుపుతున్నారు. మహిళలు హారతులు, బోనాలతో పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే దాదాపు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో విసృతంగా పర్యటించిన సబితా ఇంద్రారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో మమేకమై ఉండే సబితమ్మకు ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కారాకండిగా ప్రకటిస్తున్నారు. ప్రచారంలో ఎక్కడ చూసినా మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని, సంక్షేమాని ప్రస్తావిస్తూ.. నియోజకవర్గం మరింత అభివృద్ది చెందాలంటే మళ్ళీ సబితమ్మే రావాలని ఆకాంక్షిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నడు లేని విధంగా సబితా రెడ్డి వేల కోట్ల నిధులు తీసుకువచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే, మరోసారి సబితా రెడ్డి గెలువాలని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గత ఐదు ఏళ్ల క్రితం రోడ్లు, మంచి నీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోగా.. వీధి దీపాలు, వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర అస్వస్థతలు పడేవారు. కానీ నేడు అందుకు బిన్నంగా నియోజకవర్గంలో ఎక్కడ చూసిన రోడ్లు విస్తరించి, పెద్ద ఎత్తున రోడ్లు వేయడం జరిగింది. దాదాపు రూ. 1000 కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి మంచి నీరు అందించడానికి సబితా ఇంద్రారెడ్డి కృషి చేశారు. ఎన్నడు లేని విధంగా గత రెండు ఏళ్ల క్రితం భారీ వర్షాలు కురిసి, మీర్ పేట్, బడంగ్ పేట్ కార్పొరేషన్ల పరిధిలో పలు కాలనీలు నీట మునిగితే, రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్షంలో తడుస్తూ.. మోకాళ్ళ లోతు మురుగు నీటిలో నడుస్తూ.. సబితమ్మ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికి మర్చిపోలేరు. వరద ముప్పు శాశ్వత పరిష్కారం కోసం దాదాపు 200 కోట్లతో పరిధిలో నాలాల విస్తీర్ణం చెప్పడం జరిగింది. ఇప్పటికే మీర్ పేట్ పరిధిలో వరద నీటి కాలువలు పూర్తి అయ్యాయి. వర్షం వేస్తే వనికిపోయే జిల్లేల గూడ శ్రీదర్ కాలనితో పాటు అనేక కాలనీలు నేడు సబితమ్మ కృషి మూలంగా వరద ముప్పు సమస్య పరిష్కారం అయ్యింది. అనేక ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీధర్ కాలనీ లాంటి అనేక కాలనీలు నేడు సబితమ్మకు జేజేలు పలుకుతున్నారు. ఇదే కాకుండా అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని వినాయక హిల్స్, నంది హిల్స్, తిరుమల నగర్, విశాఖ నగర్ వంటి వందల కాలనీలు నేడు భూగర్భ డ్రైనేజీ, విశాలమైన రోడ్లు, వీధి దీపాలతో కళకళలాడుతున్నాయి. నియోజకవర్గంలో మురికి కుంపలుగా ఉన్న అనేక చెరువులను సుందరీకరణ చేసి, పార్కులు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి, పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారికి ఉపయోగపడే విధంగా చెరువులను తీర్చి దిద్దిన ఘన సబితమ్మకే దక్కుతుంది. జిల్లెలగూడ చందన చెరువు మీర్ పేట్ మంత్రాల చెరువులను చూస్తే సబితమ్మ చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నియోజకవర్గం పరిధిలోని దాదాపు రూ.40 కోట్లతో 10 చెరువులను అభివృద్ధి చేసి, సుందరీకరణ చేశారు. ఇవే కాకుండా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బడంగ్ పేట్ కేంద్రంలో అత్యాధునికమైన జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం, ప్రజా భవనం, మున్సిపల్ కార్యాలయ భవనం, మూడెకరాల విస్తీర్ణంలో ప్లే గ్రౌండ్ ఎకరాల పరిధిలో ఇంటిగ్రేడ్ మార్కెట్ తో పాటు ప్రధాన రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్య శాఖ మంత్రి ఉన్న సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ఒక లా కళాశాలను, 400 వందల పడకల మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం ఎప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని, సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కనివిరుగని రీతిలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన నియోజకవర్గ ప్రజలు సబితా ఇంద్రారెడ్డికి మరోసారి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో సబితా రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే, సబితమ్మ భారీ మెజారిటీతో మహేశ్వరం నియోజకవర్గంలో మూడోసారి గెలవడం ఖాయంగా కనిపిస్తుంది. మహేశ్వరంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులకు ప్రజలతో తగినంత సత్సంబంధాలు లేకపోగా, ఇద్దురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడం విశేషం. ఒకరు గత ఎన్నికలో కేవలం 39 వేల ఓట్లతో మూడో స్థానానికి పరిమిత కాగా, మరొక అభ్యర్థి నియోజకవర్గానికి కేవలం ఎన్నికలకు 20 రోజుల ముందు రావడం జరిగింది. బీజేపీకి ఓటు వేస్తే వృధా తప్ప, దేనికి పనికిరాదని భావిస్తున్నారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రాకపోతే, నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడుతుందని అధిక సంఖ్యలో ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు సబితా ఇంద్రారెడ్డిని తట్టుకొని గెలవడం అసాధ్యమని పలువురు పేర్కొంటున్నారు. దీనికి తోడు పార్టీలకు అతీతంగా కాలనీలకు కాలనీలు స్వచ్ఛందంగా సబితమ్మకు బేషరతుగా తమ మద్దతు ప్రకటిస్తున్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, బిఎస్పీ సీనియర్ నాయకులు ఇబ్రహీం శేఖర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాని చూసి, తన మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇబ్రహీం శేఖర్ మాదిరిగానే సబితమ్మకు పార్టీలకు అతీతంగా అనేక ప్రజా సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, నాయకులు పార్టీలకు అతీతంగా తమ మద్దతు ప్రకటిస్తున్నాను. నియోజకవర్గం పరిధిలో అనేక ప్రాంతాలలో కుల సంఘాల ఆత్మ గౌరవ భావనల కోసం స్థలాలు కేటాయించి, నిర్మాణాలకు తగినన్ని నిధులు మంజూరు చేశారు. సబితా ఇంద్రారెడ్డి అను నిత్యం ప్రజలతో మమేకమైన ఉండటమే కాకుండా నియోజకవర్గాని ఒక ఇంటిగా భావించి, అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు తెచ్చి, అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. మళ్ళీ సబితా ఇంద్రారెడ్డి గెలిస్తే, మంత్రి కావడమే కాకుండా, నియోజకవర్గం మరింత అభివృద్ది చెందుతుందని నియోజకవర్గ ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి ప్రతి సమావేశానికి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువతి యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి విజయం దాదాపు ఎప్పుడో ఖాయమైంది.




