రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నకారు

  • ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి
  • ఆగ్రహంతో ఆందోళనకు దిగిన బంధువులు

బాపట్ల, డిసెంబర్‌ 26 : ‌రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు సపంలోని రాజుపాలెం కూడలి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన బంధువులు సోమవారం ఉదయం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిధిలోని రాజుపాలెం ప్రబోధనగర్‌ ‌కాలానికి చెందిన తేళ్ల ఇజ్రాయిల్‌ ‌ట్రాక్టర్‌ ‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి డేగరాముడి వైపునుండి రాజుపాలెం వెళ్ళడానికి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఇజ్రాయిల్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి బంధువులు సుమారు 200లమంది ఘటనా స్థలానికి చేరుకొని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన మృతుడి బంధువులను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ పట్టుబట్టారు. దీంతో సోమవారం ఉదయం తొమ్మిదిగంటల నుండి జాతీయరహదారిపై 15 కిలోటర్ల వరకు ట్రాఫిక్‌ ‌నిలిచిపోయింది. ఈ సమాచారం అందుకున్న మార్టూరు సిఐ ఫిరోజ్‌ ‌సిబ్బందితో అక్కడికి చేరుకొని మృతుడి బంధువులతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజుపాలెం స్టేజి వద్ద ప్రమాదాలకుగురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆ ప్రాంతంలో  ఓవర్‌ ‌బ్రిడ్జి నిర్మించాలని ఎన్ని సార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వెంటనే అక్కడ బ్రిడ్జి నిర్మించేలా హా ఇవ్వాలని మృతుడి బంధువులు డిమాండ్‌ ‌చేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని సిఐ హా ఇవ్వడంతో మఅతుడు బంధువులు ఆందోళన విరమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *