- కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
- మహిళలకు 1550 కోట్ల ఋణాల పంపిణీ
- తొర్రూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు…100 పడకల హాస్పిటల్
- కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు
- మహబూబాబాద్, తొర్రూర్ పర్యటనలో మంత్రి కెటిఆర్
- 67 ఏండ్ల కాంగ్రెస్, భాజపా పాలన అభివృద్ధిపై సవాళ్లు
మహబూబాబాద్/తొర్రూర్, ప్రజాతంత్ర, మార్చ్ 8 : రైతులంటే ప్రాణం పెట్టి రైతుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పధకాలు ప్రారంభించి దేశంలోనే తెలంగాణ రైతులను ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దిన నాయకుడు మన ముఖ్య మంత్రి కేసీఆర్ అని, కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లుగా మార్చి, ఎండాకాలం కూడా ఏ చెరువు, కుంట, కాలువలు చూసిన నిండుగా పారే ఘనతను సాధించడానికి కారణం ముఖ్య మంత్రి స్వప్నించిన కాళేశ్వర ప్రాజెక్టు అని రాష్ట్ర ఐటి పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత మెగా క్యాన్సర్ శిబిరాన్ని, అదే విధంగా రాష్ట్రంలో డ్వాక్రా ఐకెపి బ్యాంకు రుణాలకు అనుసంధానంగా ప్రభుత్వమే బ్యాంకులకు వడ్డీలు కట్టి 1550 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశారు.
అనంతరం తోర్రూరు మండల కేంద్రములో మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగంగా సభలో రాష్ట్ర గిరిజన శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతీ రాథోడ్, గ్రామీణ మహిళా అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ…రాష్ట్రంలో రైతులకు రైతు బంధు పథకం ద్వారా టంచన్‌గా పెట్టుబడికి డబ్బులు అందిస్తున్న రాష్ట్రము దేశంలో మనదేనని, రైతు బీమా ద్వారా 5 లక్షలు రైతు చనిపోయిన వారం రోజుల్లోనే అందిస్తున్నామని, 67 ఏండ్ల కాంగ్రెస్ భాజపా పాలనలో ఏనాడూ సక్రమముగా 12 గంటల కరెంటు ఇచ్చారో చెప్పాలని, రాత్రిళ్లు కరెంటు ఇస్తే రైతులు పొలం కాడికి వెళ్లే సమయంలో పాములు ఇతర విష పురుగులు కాటు వేసి అనేక మంది రైతులు చనిపోయారన్నారు. అలాంటిదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయిన తర్వాత రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుల కష్టాలనుంచి కాపాడదన్నారు. ఒకప్పుడు కరెంట్ వొస్తే వార్త అని ఇప్పుడు తెలంగాణలో కరెంట్ పోతే వార్త అవుతుందని. ఛలోక్తి విసిరారు.
గత పాలకులు ప్రాజెక్టులు కట్టక ముందే కాలువలు తీసి నిధులు మింగేవారని దానికి ఎసరెస్పీ కాలువలు ఉదాహరణ అని అటువంటి కాలువల్లో కాళేశ్వరానీటిని మలిపించి ఎండాకాలం సైతం నీళ్లు దూకేలా చేకూరిన భగీరథుడు మన ముఖ్య మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలను గుర్తించి సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం ద్వారా 20 గ్రామాలకు రేటింగ్ ప్రకటిస్తే 19 గ్రామాలూ తెలనగానవే అని ఇది అభివృద్ధికి కదా అని భాజపా ను ప్రశ్నించారు . భాజపా నాయకులూ అంతు పొంతూలేని మాటలు మాటాడుతారని ఏఒక్క తెలంగాణ ప్రజా సంక్షేమ పథకం మీరు పాలించే రాష్ట్రాల్లో వుందా అని సవాళ్లు విసిరారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల లకు పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించారు. వడ్డీ ప్రభుత్వమే కట్టి 1550 కోట్ల రూపాయలను రాష్టంలో వున్నా డ్వాక్రా ఐకేపీ లకు బ్యాంకు ఋణాలు పొందే మహిళలకు రాయితీ తో పంపిణి చేశారు అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో తోఱురు మున్సిపాలిటీ కి 25 కోట్లు , 100 పడకల ఆసుపత్రి , కొడకండ్లకు20 కోట్లతో మినిటెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుచేసే జిఓ కాపీని మంత్రి దయాకర్ రావు కు అందించారు పాలకుర్తి మండలానికి 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు.
మంత్రి దయాకర్‌రావుకు పొగడ్తలు
అంతకు ముందే మాట్లాడిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పాలకుర్తి అభివృద్ధి పై సుదీర్ఘంగా ప్రసంగించారు చరిత్రత్మక ప్రాంతమైన పాలకుర్తిని అన్ని విధాలుగా ఆదుకోవాలని బమ్మెర పోతన పాల్కురికి సోమనాధుడు కవి వాల్మీకి నడయాడిన ప్రాంతమని అదేవిధంగా అత్యధిక పద్మశాలి గిరిజన సోదాహరులు వున్నారని వారికీ అన్నివిధాలుగా సహాయం అందించాలని అడిగిన మంత్రిని కేటీఆర్ ప్రసంగంలో పొగడ్తలతో ముంచెత్తారు దేశములోనే గ్రామీణ అభివృద్ధి మంత్రి గా ఎన్నో అవార్డులు తీసుకున్నారని అదేవిదంగా ముఖ్య మంత్రి కళను గ్రామీణభారతాన్ని అతి తక్కువ సమయంలో అభివృద్ధి రూపంలో చూపి శ్మశాన వాటిక మొదలుకొని డంపింగ్’ యార్డు పంచాయతీ లకు ట్రాక్టర్లు అందించి దేశంలో తెలంగాణ ఉత్తమ రాష్త్రంగా అవార్డును అందించారని అన్నారు అనంతరం ఉష దయాకర్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమాజంలో కష్టించి ప్రగతి సాధించిన పలువురు మహిళలను సన్మానించారు.
ఈ బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లా పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ మాలోత్ కవిత రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ ధర్మారెడ్డి , నన్నపునేని నరేందర్ శంకర్ నాయక్ రెడ్యా నాయక్ ఎమ్మెల్సీ లు కడియం శ్రీ హరి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్‌రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఐకెపి రాష్ట్ర జిల్లా నాయకులూ వివిధ మండలల జడ్పిటిసిలు ఎంపీపిలు సర్పంచులు రైతు కో ఆర్డినేటర్లు గ్రామా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.




